English   

మెగా హీరో సినిమాకి కొత్త హీరోయిన్ ?

 Krithi Shetty
2019-05-18 18:03:38

 మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `ఉప్పెన‌` అనే టైటిల్‌ను ఈ మధ్యే ఖ‌రారు చేసింది సినిమా యూనిట్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖలో అసిస్టెంట్‌గా ప‌నిచేసిన బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం కొన్ని రోజుల కిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి త‌న‌కుంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయ్ సేతుప‌తి ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన యూనిట్ ఈరోజు వైష్ణవ్ తేజ్ సరసన నటించే హీరోయిన్ ని ప్రకటించింది, తమిళ నటి కీర్తి శెట్టి ఈ సినిమాతో తెలుగులో పరిచయం కానుందని కొద్ది సేపటి క్రితమే టీం ప్రకటించింది. ఈ కినిమాలొఇ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

More Related Stories