English   

రామ్ పోతినేనితో కృతిశెట్టి రొమాన్స్ 

Krithi Shetty
2021-03-06 11:39:44

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఆవారా’, ‘పందెంకోడి’ చిత్రాల ద‌ర్శకుడు ఎన్‌.లింగుస్వామి ద‌ర్శక‌త్వంలో ఒక ద్విభాషా చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఊర మాస్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్నట్లు అధికారికంగా ప్రక‌టించింది చిత్ర యూనిట్‌. రామ్ పోతినేని కెరీర్‌లో 19వ సినిమా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా లింగుస్వామి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వర‌లోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

More Related Stories