English   

నేనెప్పుడూ నీ తమ్మున్నే అన్నా... పవన్ కళ్యాణ్‌తో KTR...

Pawan Kalyan KTR.jpg
2020-03-26 22:56:24

రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన వాళ్లు శత్రువులు అయిపోరు. బయటికి సామాజిక విషయాలపై కొట్లాడుకుంటున్నా కూడా లోపల మాత్రం వ్యక్తిగతంగా వాళ్లంతా కలిసే ఉంటారు. ఇప్పుడు కేటీఆర్, పవన్ కళ్యాణ్ లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నిజానికి కేటీఆర్ తో పాటు కేసీఆర్ ను కూడా చాలాసార్లు విమర్శించాడు పవన్. ఆడెవడో సినిమా యాక్టర్ అంట.. వాడికెంత ధైర్యం అంటూ పవన్ ను కూడా కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు విమర్శించాడు. కానీ అదంతా రాజకీయంగానే.. పర్సనల్ గా చూసుకుంటే మాత్రం ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది.

ఇప్పుడు మరోసారి అది బయటపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు విరాళం అందించాడు పవన్. కరోనా బాధితుల కోసం ఈయన మొత్తం 2 కోట్లు అందించాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. గ్రేట్ గెస్చర్ అన్నా అంటూ ట్వీట్ చేసాడు. దీనికి వెంటనే పవన్ కళ్యాణ్ చూసి రిప్లై కూడా ఇచ్చాడు. మీరు, మీ నాన్నగారు ఇలాంటి భయానక పరిస్థితుల్లో తీసుకుంటున్న చర్యలు.. చేస్తున్న పనులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు. కానీ చివర్లో సర్ అంటూ కేటీఆర్ ను సంబోధించాడు పవన్.

దీనికి థ్యాంక్స్ అన్నా అంటూ రిప్లై ఇచ్చిన కేటీఆర్.. మీరు నన్ను సర్ అని ఎప్పట్నుంచి పిలుస్తున్నారు.. తమ్ముడు అని పిలవండి అంటూ ట్వీట్ చేసాడు. నేను ఎప్పుడూ మీ తమ్ముడినే అంటూ ఆప్యాయంగా రిప్లై ఇచ్చాడు కేటీఆర్. ట్విట్టర్‌లో ఈ ఇద్దరి చర్చ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories