English   

మహానటికి కెటీఆర్ సర్టిఫికెట్ 

KTR-mahanati
2018-05-18 09:07:38

మహానటి.. మహానటి.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పలవరిస్తోన్న పేరిది. కీర్తి సురేష్ నటనకు స్పెల్ బౌండ్ కానివారు లేరు. మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ రియలిస్టిక్ మూవీకి రియలిస్టిక్  ప్రెయిజింగ్సే వస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలోని ఎంతోమంది ఈ సినిమా గురించి గ్రేట్ గా మాట్లాడారు.. మాట్లాడుతున్నారు. అయితే సినిమాల కు సంబంధించి ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ కె టీఆర్ మహానటి పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఇది ఎంత గొప్ప సినిమా. నిజంగా ఈ సినిమాకు నేను ఫిదా అయ్యాను. కీర్తీ నువ్వు ఈ పాత్రలో జీవించావు.అద్భుతమైన నటన చూపించావు’’అంటూ తన అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా చాటుకున్నాడు. ఇక కెటీఆర్ లాంటి వాళ్లు సినిమాలను ప్రశంసిస్తోంటే ఇక టాలీవుడ్ ఇక్కడ ఇంక వారికి ఇబ్బందేం ఉంటుంది.  అయితే కెటీఆర్ ప్రసంసకు వైజయంతీ మూవీస్ బ్యానర్ కూడా ఆశ్చర్యపోయినట్టుంది. అందుకే వెంటనే ఈ ట్వీట్ ను జోడిస్తూ కెటీఆర్ కు థ్యాంక్స్ చెబుతూ మరో ట్వీట్ పోస్ట్ చేశారు. ‘ మా వర్క్ మీకు నచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉందంటూ’ రీ ట్వీట్ చేశారు.. మొత్తంగా మహానటి జోరుకు ఇప్పుడప్పుడే బ్రేకులు పడేలా లేవు. 

More Related Stories