English   

ఆ సిఎమ్ కొడుకు హీరో.. ఈ సిఎమ్ కొడుకు గెస్ట్.!!

ktr and nikhil gowda
2018-07-04 18:28:44

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాజకీయాలతో పాటు సినిమాల విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో అంరదికీ తెలిసిందే. ఏదైనా సినిమా చూసి నచ్చితే ఫ్రీ పబ్లిసిటీ కూడా ఇస్తాడు. ఇక రీసెంట్ గా మహేష్ బాబు భరత్ అనేనేనుకు ఏకంగా ఇంటర్వ్యూ చేసి పెట్టాడు. అలాగే విజయ్ దేవరకొండ ప్రతి సినిమా ఫంక్షన్ కూ అటెండ్ అవుతున్నాడు. తను మంత్రి అయిన దగ్గర్నుంచీ సినిమా వారికి చాలా దగ్గరగా మసలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కెటిఆర్ ఓ కన్నడ హీరో సినిమా సెట్స్ కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అక్కడ ‘ఒక్క విజిట్ రెండు లాభాలు’ అనే ఫార్ములా ఫాలో అయ్యాడనుకోండి. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా పేరు సీతారామకళ్యాణ. అయితే సినిమా షూటింగ్ వద్దకు సిఎమ్ కుమారస్వామి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న కెటిఆర్ కూడా షూటింగ్ లొకేషన్ కు వెళ్లాడు. ఆ సినిమా సెట్స్ లో కాసేపు హల్చల్ చేసిన కెటిఆర్ నిఖిల్ తో పాటు ఆ సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తర్వాత ముఖ్యమంత్రితో భేటీ అయ్యాడు. దక్షిణాది రాజకీయాలపై కొంత సేపు మాట్లాడుకున్నారు. అయితే కుమార స్వామి ప్రమాణ స్వీకారం రోజు చాలామంది ముఖ్యమంత్రులు వెళ్లారు. కానీ కెసిఆర్ ముందు రోజే వెళ్లి వచ్చాడు. ఇటు దేవెగౌడ రీసెంట్ గా హైదరబాద్ వచ్చి కెసిఆర్ ను కలిశాడు. ఇప్పుడు కెటీఆర్ కుమారస్వామిని కలిశాడు. ఈ మొత్తం కలయిక వెనక ఏదో పొలిటికల్ గూడుపుఠానీ జరుగుతోందనేది పొలిటికల్ అనలిస్ట్ లు చెబుతోన్నమాట. అవన్నీ ఎలా ఉన్నా.. తెలుగులో జాగ్వార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత కన్నడలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

More Related Stories