English   

లక్ష్మీ మంచు ఆహా సరికొత్త ఫన్‌ టాక్‌ షో ఆహా భోజనంబు

Lakshmi Manchu
2021-07-11 00:27:23

హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్యమం లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు, వెబ్‌ షోస్‌, ఒరిజనల్స్‌తో వీక్షకులకు సరికొత్త వేదికగా మారింది. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌ షో సామ్‌ జామ్‌, తమాషా విత్‌ హర్ష అంటూ వైవా హర్ష వ్యాఖ్యాతగా చేసిన షోతో పాటు రానా దగ్గుబాటి హోస్ట్‌ చేసిన నెంబర్‌ వన్‌ యారి వంటి టాక్‌ షోలతో, నాన్‌ ఫిక్షనల్‌ కంటెంట్‌తో తెలుగు డిజిటల్ మాధ్యమంలో కొత్త శకానికి తెర తీసింది. తాజాగా మరో టాక్‌ షోతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది 'ఆహా'..నటి, నిర్మాత లక్ష్మీ మంచు హోస్ట్‌ చేయనున్న షో..'ఆహా భోజనంబు'. టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ సెలబ్రిటీలు రుచికరమైన వేర్వేరు వంటకాలను వండుతూ హోస్ట్‌కు వంటలపై తమకున్న ప్రేమను తెలియజేస్తూనే వివిధ సంగతులను తెలియజేస్తారు. 

సహ సమర్పకులుగా ఎంటీఆర్‌, హిమాలయ ప్యూర్‌ హ్యాండ్స్‌....

వివిధ రకాల వంటకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ రుచికరమైన వంటకాలను అందిస్తోన్న లీడింగ్ ప్యాక్‌డ్‌ ఫుడ్‌ కంపెనీ ఎంటీఆర్‌. భోజన ప్రియులైన తెలుగువారు నచ్చేలా ఎన్నో వెరైటీ వంటకాలను ఎంటీఆర్‌ అందిస్తోంది. సాంబార్, మసాలా కారం, గులాబ్‌ జామ్‌ మిక్స్‌తో పాటు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే దోశ, ఇడ్లీ మిక్స్‌లను సాంబార్, మసాలా కారం వంటి ఎన్నో స్పెషల్స్‌ ఎంటీఆర్‌లో లభ్యమవుతున్నాయి. ఈ షోలో ఎంటీఆర్‌ ఉత్పత్తులను సెలబ్రిటీలు ఎలా ఉపయోగించాలి, ఏ కాంబినేషన్‌లో ఉపయోగిస్తే బోజన ప్రియులకు నచ్చుతుందనే వివరాలను తెలియజేస్తారని ఎంటీఆర్‌ ఫుడ్స్‌ ప్రై.లి చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సునాయ్‌ బాసిన్‌ తెలిపారు. 

హిమాలయ వెల్‌నెస్‌ తయారుచేసే అత్యుత్తమ ప్రొడక్ట్స్‌లో హిమాలయ ప్యూర్ హ్యాండ్స్‌ ఒకటి. హిమాలయ శానిటైజర్స్‌, హ్యాండ్‌ వాష్‌లను విస్తృతశ్రేణిలో అందిస్తూ ముందంజలో ఉంది. దీనిపై హిమాలయ వెల్‌నెస్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రొడక్ట్‌ డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌ సర్ఫరాజ్‌ రుమానె మాట్లాడుతూ "సెలబ్రిటీ కుకింగ్ షో అయిన ఆహా భోజనంబులో మేం భాస్వామ్యం అవుతుండటం చాలా ఆనందంగా ఉంది. సెలబ్రిటీలు ఆహారాన్ని తయారు చేయడం అదే సమయంలో పరిశుభ్రత గురించి చెప్పడం అనేది మంచి విషయం. మా ప్యూర్ హ్యాండ్స్ ప్రొడక్ట్స్‌ తులసి, నిమ్మకాయ, వెటివర్, ఉసిరి మొదలైన సహజ యాంటీ మైక్రోబయల్ మూలికలతో తయారు చేయబడింది, ఇంట్లో మరియు ప్రయాణంలో 99.9% సూక్ష్మక్రిమి రక్షణను ఇస్తుంది. ఇప్పుడు ఆహా షోలో భాగం కావడం వల్ల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను విస్తరిస్తాము. అదే హిమాలయ అత్యున్నత లక్ష్యం" అని తెలిపారు. 

'ఆహా భోజనంబు' కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలు ఆహారంతో వారికున్న మంచి జ్ఞాపకాలను తెలియజేస్తూనే సరదాగా సంభాషణ చేస్తారు. వంటకు సంబంధించిన కోణంలో సరదాగా సాగే 'ఆహా భోజనంబు' కార్యక్రమం టాక్‌షోలలో కొత్త ఫార్మేట్‌ అనే చెప్పాలి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తరుణ్‌ భాస్కర్‌, విష్ణు మంచు, అఖిల్‌ అక్కినేని, ప్రకాశ్‌రాజ్‌, ఆనంద్‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, విష్వక్‌సేన్‌ వంటి స్టార్స్‌ ఈ షోలో పాల్గొనబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో షోలో సరికొత్త తళుకులుంటాయనడంలో సందేహం లేదు. టాక్‌షోస్‌లలో లక్ష్మీ మంచుకున్న అపారమైన అనుభవం తప్పకుండా అందరినీ మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.

More Related Stories