English   

వర్మ పాట టీడీపీ వాళ్ళు కూడా వాడుకుంటారేమో ?

Lakshmis-NTR
2019-02-12 06:28:42

రవిశంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, అంతకు మించి హీరో సాయి కుమార్ సోదరుడిగా అందరికీ సుపరిచితుడే. అరుంధతీ సినిమాలో వదల బొమ్మాళీ వదల అంటూ రవిశంకర్ తనదైన బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. అలాగే ఆయన రభస సినిమాలో పండించిన విలనిజం అందరికీ తప్పకుండా గుర్తుండి పోతాయి. అలా ఇప్పటివరకు డబ్బింగ్ తో, నటనతో మెప్పించిన రవిశంకర్ తాజాగా గాయకుడిగ కూడా మారిపోయాడు. రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రవిశంకర్ తో ప్రత్యేకంగా పాట పాడించాడు వర్మ. సిరాశ్రీ రాసిన 'సింహ గర్జన' పాటకు కల్యాణ్ మాలిక్ సంగీత సారథ్యంలో రవిశంకర్ సింహ గర్జన చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం బొమ్మాళీ రవిశంకర్ ఉరుములు పుట్టించే పాట... హే రవిశంకర్..‌ నీ స్వరంలోని పవర్‌ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా వినపడేలా ఉందని ట్వీట్‌ చేశారు వర్మ.  ఈ సినిమా లో పాత ఎంత ప్రబావం చూపనుందో పక్కనే ఉన్న కళ్యాణి మాలిక్ ని చూస్తే అర్ధం అవుతుంది. ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు అని ఇండస్ట్రీలో పేరుంది, అలాంటి ఆయనే ఊగిపోతున్నాడు అంటే ఇంకా పూర్తి పాట బయటకు వస్తే ఇప్పటి దాకా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వ్యతిరేకిస్తున్న టీడీపీ వారు, ఈ పాటను పార్టీ ఫంక్షన్లలో పెట్టుకున్నా ఆశ్చర్యం లేదనిపిస్తోంది మరి. 

More Related Stories