English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ !

,Lakshmi's NTR Review
2019-03-29 13:44:35

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగుపెట్టిన తరవాత జరిగిన పరిణామాలు ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరనే విషయంలో రెండు వాదనలు ఉన్నాయి. సొంత అల్లుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవటం వల్లే ఆ బాధను తట్టుకోలేక ఎన్టీఆర్ కన్నుమూశారనేది ఒక వాదన అయితే లక్ష్మీ పార్వతి మాయలో పడి ఎన్టీఆర్ కుటుంబానికి దూరమై క్షోభ పడి ఆ భాద వలన మరించారని మరో వాదన. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవ్వరికీ తెలీదు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడవటమే తాను నమ్మిన నిజం అని లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించారు వర్మ. ఈ సినిమా ఎన్నో వివాదాల నడుమ వాయిదా పడుతూ పడుతూ ఎట్టకేలకు రిలీజయ్యింది ఏపీలో మినహా ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కధ :
1989 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి సినిమా మొదలవుతుంది. పార్టీ ఓటమితో ఎన్టీఆర్ కి ఆయన కుటుంబం దూరమవుతుంది. ఎన్టీఆర్ ఏకాకి అయిపోతారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ జీవితంలోకి తన జీవిత కథ రాస్తానంటూ లక్ష్మీ పార్వతి వస్తుంది. అలా వచ్చిన లక్ష్మీ పార్వతిని ఆమెకు ఆ అర్హత ఉందని గ్రహించిన ఎన్టీఆర్ సరేనంటారు. ఇక అక్కడి నుంచి లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ మధ్య బంధం ఎలా ఏర్పడింది? అది వివాహానికి ఎలా దారితీసింది? వీరిద్దరి బంధాన్ని కుటుంబం ఎలా జీర్ణించుకోలేకపోయింది? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా పొడిచారు? అనే విషయాలే సినిమాలో హైలైట్ చేశారు.
కధనం :
ఇప్పటికే నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రెండు సినిమాలు వచ్చాయి. నందమూరి బాలక్రిష్ణ స్వయంగా తన తండ్రి జీవితాన్ని తెరకెక్కించినా పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీనికి కారణం ఎన్టీఆర్ జీవితంలో ఎంతో కీలకమైన ‘వెన్నుపోటు’ ఎపిసోడ్. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇదే నిజం అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జీవితం అంతా రాజుగా బ‌తికినా చివ‌రి రోజుల్లో మద‌న‌ప‌డ్డాడ‌ని అన్దరోఅ నుకునే వారు దానిని కళ్ళకు కట్టినటు చూపాడు వర్మ. వ‌ర్మ ఈ సినిమాను పూర్తి విశ్లేషించి నిజాలు చూపించాడా.. లేదంటే అనుకున్న‌ది చూపించాడా, త‌న‌కు తెలిసింది తెర‌కెక్కించాడా అనేది ప‌క్క‌న‌బెడితే చాలా రోజుల త‌ర్వాత‌,  ఈయ‌న నుంచి ఇంట్రెస్టింగ్ సినిమా మాత్రం వ‌చ్చింది అనేది కాద‌న‌లేని స‌త్యం. స్లోగా సాగుతున్న‌ట్లు అనిపించినా అక్క‌డున్న‌ది జీవితం కాబ‌ట్టి ఎమోష‌న్ కోసం సాగ‌తీత త‌ప్ప‌లేదు. ఫ‌స్టాఫ్ అంతా ల‌క్ష్మీ పార్వ‌తి, ఎన్టీఆర్ మ‌ధ్య ఉన్న ప్రేమ‌క‌థ‌ను చూపించాడు వ‌ర్మ‌, కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చూసిన త‌ర్వాత వ‌ర్మ ఈజ్ బ్యాక్ అనిపించింది. ముఖ్యంగా ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత వ‌చ్చే ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తి డాన్స్ అదిరిపోయింది. సెకండాఫ్ అంతా వెన్నుపోటు రాజ‌కీయ నేప‌థ్యంలోనే సాగింది.. అందులో నిజానిజాలు తెలియ‌దు కానీ చంద్ర‌బాబు పాత్ర‌ను మాత్రం పూర్తిగా విల‌న్ చేసి, లక్ష్మీ పార్వతిని మదర్ థెరిసా లాగా చూపించాడు వ‌ర్మ‌ అది ఎంత‌వ‌ర‌కు ఫ్యాన్స్ ఒప్పుకుంటారో చూడాలి ?  
నటీనటులు :
నటీనటుల విషయానికి వస్తే ఎన్టీఆర్ పాత్ర‌లో రంగ‌స్థ‌ల న‌టుడు విజ‌య్ కుమార్ ప్రాణం పోసాడు.. ల‌క్ష్మీ పార్వ‌తిగా య‌జ్ఞా శెట్టి బాగా చేసింది..అయితే వీళ్లిద్ద‌రి కంటే చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో శ్రీ తేజ్ అద‌ర‌గొట్టాడు.. ఆయ‌నే సినిమా అంతా క‌నిపించాడు..ఓవ‌రాల్‌గా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప‌రంగా చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించింది.
సాంకేతిక పరంగా :
సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం సంగీతం. కళ్యాణి మాలిక్ తన నేపథ్య సంగీతంతో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇక డైలాగులు బాగున్నాయి. రామి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ మీద శ్రద్ద పెడితే బాగుండేది.
ఫైనల్ గా :
ఇది వర్మ వర్షన్ ఎన్టీఆర్ జీవిత కధ

More Related Stories