English   

ర‌వితేజకు ఇదే చివ‌రి అవ‌కాశ‌మా..? 

Ravi-Teja
2018-12-04 13:38:02

ర‌వితేజ ఇప్పుడు వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు మాత్రం ఈయ‌న‌పై న‌మ్మ‌కం త‌గ్గ‌డం లేదు. ఎన్నోఏళ్లుగా క‌ష్ట‌ప‌డి క‌ట్టుకున్న కోట క‌దా.. అంత ఈజీగా బీట‌లు బార‌దు. ఒక్క హిట్ వ‌చ్చిందంటే చాలు మ‌ళ్లీ ర‌వితేజ బ్యాక్ అనిపిస్తాడు. దానికోస‌మే ఇప్పుడు ఈయ‌న ప్ర‌య‌త్నాల‌న్నీ కూడా. ఇప్పుడు ర‌వితేజ మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌య్యాడు. మొన్న‌టికి మొన్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని విఐ ఆనంద్ సినిమాతో బిజీ అయ్యాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ లోనే మొద‌లు కానుంది. ఈ చిత్రం పూర్తిగా సైన్స్ ఫిక్ష‌న్ అని తెలుస్తుంది. అస‌లు ప్ర‌యోగాలంటే కిలోమీటర్ దూరం వెళ్లిపోయే ర‌వితేజ‌.. ఇప్పుడు ఏరికోరి ఈ సినిమా చేస్తున్నాడు. 

అస‌లు బాలేదు అనేకంటే కూడా ఏదో ఓ మంచి సినిమా చేసాడు అనే తృప్తి అయితే ఇప్పుడు కావాలి ఈ హీరోకు. ఎందుకంటే వ‌ర‌స‌గా రొటీన్ సినిమాలు చేసి చేసి ఒక‌దాన్ని మించి మ‌రో ఫ్లాప్ ఇచ్చేస్తున్నాడు మాస్ రాజా. ఈయ‌న సినిమా అంటేనే ఇప్పుడు బ‌య్య‌ర్ల‌కు వ‌ణుకు వ‌చ్చేస్తుంది. క‌నీసం ట‌చ్ చేయాల‌న్నా కూడా వ‌ణికిపోతున్నారు డిస్ట్రిబ్యూట‌ర్లు. ఇలాంటి స‌మ‌యంలో ఆనంద్ సినిమా ఓకే అయింది. క‌చ్చితంగా ఈ చిత్రం త‌న‌కు మంచి బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు మాస్ రాజా. ఇందులో న‌భాన‌టేష్, ప్రియాంక జ‌వాల్క‌ర్, పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. ర‌వితేజ‌కు ఈ అవ‌కాశం ఎలా ప‌ని చేయ‌బోతుందో..?

More Related Stories