English   

అమ్మా హీరోయిన్లూ ఇకనయినా ఛారిటీకి డబ్బివ్వండి...లేదా లావయిపోతారు !

lavanya
2020-03-29 10:42:30

మహమ్మారి కరోనా వైరస్‌ జడలు విప్పడంతో దేశంలో లాక్‌డౌన్‌ పాటిస్తున్నాం.  అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు ఆగిపోయాయి.  ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారు. విదేశాల నుంచి ఎవరూ భారత్‌కు రాకుండా కట్టడి చేశారు. ఫారిన్‌ నుంచి వచ్చే ఫ్లయిట్స్‌ ఎప్పుడో నిలిచిపోయాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి చాలా మంది ముందుకు వచ్చి తమ వంతుగాఆర్థిక సహాయం చేస్తుంటే మరికొందరు వస్తువులను పేదవారికి ఇచ్చి తమ ఉదాత్తతను చాటుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో విరాళాలు ప్రకటించిన వారిలో కేవలం నటులు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే ఉండగా వారితో సమానంగా సంపాదిస్తున్న హీరోయిన్స్ ఎవరూ రూపాయి తీయకపోవడం విచారకరం. ఇప్పటిదాకా కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో నీతులు చెప్పడమే తప్ప రూపాయి విదిల్చింది లేదు.

ఈ నేపథ్యంలో కన్నడ భామ ప్రణీత తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చి మిగతా వారికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు కానీ ఒకప్పుడు తనను ఆదరించిన జనం కోసం ఆమె నిలబడింది. ఆమెను చూసి లావణ్య ముందుకు వచ్చింది.  పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం సినీ పెద్దలు ఏర్పాటు చేసిన సిసిసి (కరోనా క్రైసిస్ ఛారిటీ) అనే దానికి నిన్న లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ ‘సిసిసి’ రోజువారీ వేతనం తీసుకునే వారి కోసం ఏర్పాటు చేశారు. అయితే ముందు ప్రణీత ఇచ్చినా అది ప్రభుత్వానికి చెందనుంది. లావణ్య కరోనా క్రైసిస్ ఛారిటీ‌కి విరాళం ఇచ్చిన తొలి నటిగా గుర్తింపు పొందింది. ఇక సమంతా, అనుష్క, రకుల్ ప్రీత్, పూజా లాంటి వాళ్ళు ఇండస్ట్రీ నుండి చాలా తిన్నారని అలాంటి వారు కనీసం రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణం అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇకనయినా ఇవ్వాలని లేదంటే లావయిపోతారని కామెంట్లు చేస్తున్నారు.

More Related Stories