English   

మళ్లీ ఇద్దరు హీరోయిన్లా మిస్టర్..? 

Lavanya-Tripathi
2018-04-10 09:40:19

సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే కంటెంట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. స్పేస్ మూవీస్ లో రొమాన్స్ కు, ఎంటర్టైన్మెంట్స్ స్పేస్ తక్కువగా ఉంటుంది. అయినా తన సినిమాలో ఇద్దరు భామలతో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు వరుణ్ తేజ్. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ చేయబోతోన్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుంది టీమ్. ఇంతకు ముందు వినిపించిన బ్యూటీస్ ను కాకుండా ఆశ్చర్యంగా ఆ ఇద్దరు భామలను ఇంటర్ డ్యూస్ చేశారు. ఒకరు చెలియా ఫేమ్ అదితిరావు హైదరి. మరొకరు లావణ్య త్రిపాఠి. అదితిరావుకు ఇప్పుడిప్పుడే తెలుగులో ఆఫర్స్ పెరుగుతున్నాయి. డబ్బింగ్ సినిమా అయినా చెలియాలో అమ్మడిని చూసిన ఎంతోమంది మనసు పారేసుకున్నారు. అందులో మోహన కృష్ణ ఇంద్రగంటి ఒకడు. అందుకే వెంటనే తన సినిమాలో తీసుకున్నాడు. సుధీర్ బాబుతో ఇంద్రగంటి చేస్తోన్న సమ్మోహనంలో తనే హీరోయిన్. తర్వాత అదితి చేస్తోన్న రెండో తెలుగు సినిమా ఇదే. ఇక లావణ్య త్రిపాఠి ఆల్రెడీ వరుణ్ తో మిస్టర్ అనే సినిమాలో రొమాన్స్ చేసింది. మిస్టర్ డిజాస్టర్ అయినా.. మళ్లీ లావణ్యను రిపీట్ చేస్తుండటం ఆశ్చర్యమే. అఫ్ కోర్స్ ఆ డిజాస్టర్ లో లావణ్య పాత్ర లేకపోయినా సెంటిమెంట్ అంటూ ఫీలవుతారు కదా మనాళ్లు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. మొత్తంగా మిస్టర్ తర్వాత వరుణ్ తేజ్ ఇద్దరు హీరోయిన్లతో చేస్తోన్న రెండో సినిమా ఇది.. 
 

More Related Stories