English   

ఆ రాక్ష‌సి మ‌ళ్లీ మొద‌లుపెట్టిందిగా...?

Lavanya-Tripathi
2018-05-16 07:40:50

సినిమా ఫ్లాపుల్లో హీరోయిన్ షేర్ చాలా త‌క్కువే అయినా.. దానివ‌ల్ల ఎక్కువ లాస్ అయ్యేది మాత్రం వాళ్లే. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాలో న‌టించిన హీరోయిన్ కు ఫ్లాప్ హీరోయిన్ అన్న ట్యాగ్ చాలా ఈజీగా వేసేస్తారు. అలాంటిది ఇక వ‌రుస‌గా సినిమాలు పోతే.. ఏమంటారు. ఏకంగా ఐర‌న్ లెగ్ అనేస్తారు. అలా మొన్న‌టి వ‌ర‌కూ ఇక ఈవిడ పనైపోయింది అన్న క‌మెంట్స్ స్థానే ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లుపెడుతోంది గా అనే మాట‌లు వినిపిస్తున్నాయి. యస్ మ‌నం మాట్లాడుకునేది అందాల రాక్షసి లావ‌ణ్య త్రిపాఠి గురించే. 

అందాల రాక్ష‌సితో ఎంట్రీ ఇచ్చి.. అంద‌రినీ ఆక‌ట్టుకుని.. ఒక ద‌శ‌లో టాప్ స్టార్స్ లీగ్ లోకీ వెళ్లిపోయిందీ స‌న్న‌జాజి. కానీ అనుకోకుండా వ‌రుస‌గా ఫ్లాపులు చుట్టుముట్టాయి. లాస్ట్ ఇయ‌ర్ ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు పోయాయి. దీంతో ఇక లావ‌ణ్య ప‌నైపోయింది అనుకున్నారు అంద‌రూ. దీనికి తోడు కొత్త‌గా వ‌స్తోన్న భామ‌లు కూడా రెచ్చిపోతుండ‌టంతో ఇక లావ‌ణ్య‌ను ఎవ‌రు పట్టించుకుంటార‌ని కూడా చెప్పుకున్నారు. బ‌ట్ అనూహ్యంగా ఆమెకు వ‌రుణ్ తేజ్ కొత్త సినిమాలో చాన్స్ వ‌చ్చింది. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తోన్న ఈ మూవీకి ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ డైరెక్ట‌ర్. అదితిరావు హైద‌రి మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇదే ఆశ్చ‌ర్యం అంటే ఇప్పుడు లావ‌ణ్య‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చింది. 

నిఖిల్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో లావ‌ణ్య‌ను హీరో్యిన్ గా తీసుకున్నారు. నిజానికి ఈ సినిమాలో ముందుగా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండేను తీసుకున్నారు. కానీ కొన్ని ఫోటోషూట్స్ చేసిన త‌ర్వాత అమ్మ‌డు నిఖిల్ స‌ర‌స‌న అస్స‌లు సూట్ కావ‌డం లేద‌ట‌. దీంతో కొన్నాళ్లు వెయిట్ చేసి ఫైన‌ల్ గా లావ‌ణ్య‌ను తీసుకున్నారు. సో.. ఈ రెండు సినిమాలో ఏ ఒక్క‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా అమ్మ‌డు మ‌ళ్లీ ఆఫ‌ర్స్ అందుకుంటుంది. అదే టైమ్ లో ఈ రెండూ తేడా కొట్టాయా.. ఇక త‌ను ల‌గేజ్ సర్ధుకోవ‌డ‌మే.. 

More Related Stories