English   

ఎన్టీఆర్ కోసం ల‌య‌బ‌ద్ధంగా వ‌స్తుందోచ్

NTR-laya
2018-03-07 14:20:53

తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు అమ్మ‌యిలు హీరోయిన్లుగా నెగ్గుకురాలేర‌నే సెంటిమెంట్ కు బీట‌లు వారుస్తూ.. తెలుగులో ఓ వెలుగు వెలిగిన బ్యూటీ ల‌య‌. విజ‌య‌వాడ నుంచి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ స్వ‌యంవ‌రం సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే అంద‌రి మెప్పు అందుకున్న ల‌య‌.. త‌క్కువ టైమ్ లోనే 50 సినిమాల్లో న‌టించింది. చివ‌ర‌గా ఈమె 2010లో బ్రహ్మలోకం టూ యమలోకం అనే సినిమాలో పరాశక్తి పాత్రలో కనిపించింది. ఆ త‌ర్వాత‌ లయ పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది. అసలు ఈమె ఇప్పుడెక్కడుంది.. ఏం చేస్తుంద‌నే విష‌యంపై కూడా చాలా మందికి క్లారిటీ లేదు. సినిమాల‌కు దూర‌మైన త‌ర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడింది ల‌య‌. అక్క‌డే పది సంవత్సరాలకు పైగా భ‌ర్త‌తో క‌లిసి ఉంటుంది ల‌య‌.  

తెలుగ‌మ్మాయే అయినా.. లాస్ ఎంజిల్స్ తో ల‌య‌కు చెప్ప‌లేని అనుబంధం ఏర్ప‌డింది. పైగా స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్ అయిన లయ అమెరికాలోనే ఉంటూ ఆ క‌ళ‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె అక్క‌డ ఓ డ్యాన్స్ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. అందులోనే ఆమె కూతురికి కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ ఇప్ప‌టికీ త‌న‌కు నటించాలని ఉందని.. అయితే అమెరికాలో ఉండ‌టంతో అది సాధ్య‌ప‌డ‌ట్లేద‌ని చెబుతుంది ల‌య‌. ఇప్పుడు చాలా ఏళ్ళ త‌ర్వాత ఈమె రీ ఎంట్రీపై వార్త‌లొస్తున్నాయి. త‌న ప్ర‌తీ సినిమాలో ఓ పాత హీరోయిన్ ను తీసుకొచ్చే అల‌వాటున్న త్రివిక్ర‌మ్.. ఇప్పుడు ల‌య‌ను ఎన్టీఆర్ సినిమా కోసం తీసుకొస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. న‌దియా.. ఖుష్బూ.. స్నేహ త‌ర్వాత ఇప్పుడు ల‌య‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయిస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు.

More Related Stories