English   

కొర‌టాల శివకు లీగ‌ల్ నోటీసులు

Koratala-siva
2018-05-10 16:11:09

దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల‌కు... అనే సామెత వినే ఉంటారు క‌దా.. మ‌రోసారి ఇది గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు భ‌ర‌త్ అనేనేను విడుద‌లైన మూడు వారాల‌కు ఆ సినిమాలో ఓ త‌ప్పు ఉందంటూ ఓ పెద్దాయ‌న ఇప్పుడు గ‌గ్గోలు పెడుతున్నాడు. భ‌ర‌త్ అనేనేను సినిమాలో న‌వోద‌యం అనే పార్టీ ఉంటుంది గ‌మ‌నించారా. ఇది అపోజిష‌న్ పార్టీ. అంటే ఆబ్వీయ‌స్ గా అది అవినీతి చేస్తుంది. ఇదే ఇప్పుడు కొత్త కేస్ కు కార‌ణం కాబోతోంది. య‌స్.. భ‌ర‌త్ అనేనేనులో వాడిన ఈ పార్టీ దాని గుర్తు ఆల్రెడీ కొంద‌రు 2012లోనే రిజిస్ట‌ర్ చేసుకున్నార‌ట‌. కానీ మా ప‌ర్మిష‌న్ కానీ, కాపీ రైట్ చ‌ట్టానికి, ఎన్నిక‌ల సంఘం నియ‌మావ‌ళికి భిన్నంగా ఈ గుర్తును, పార్టీ పేరును సినిమాలో వాడార‌ని.. ఇది చ‌ట్ట‌బ‌ద్ధంగా నేరం అంటూ రామూ అనే వ్య‌క్తి ఆరోపించారు. త‌మ పార్టీని చెడ్డ పార్టీగా సినిమాలో చూపించ‌డం వ‌ల్ల నిజంగానే ఉన్న‌ త‌మ పార్టీకి కూడా అది వ‌ర్తిస్తుంద‌ని వాపోతున్నాడు. అలాగే ఈ విష‌యంపై త‌మ లాయ‌ర్ ద్వారా స‌ద‌రు చిత్ర ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు పంపించార‌ట‌. వారం రోజుల్లో వారి నుంచి స‌రైన  స‌మాధానం రావాల‌ని,, అలాగే సినిమాలో త‌మ పార్టీకి వ్య‌తిరేకంగా ఉన్న సీన్స్ తొల‌గించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ఈ గొడ‌వ ఎటు తేలుతుందో కానీ.. సినిమా వ‌చ్చిన టైమ్ లోనే గొడ‌వ స్టార్ట్ చేసి ఉంటే కాస్త లాభ‌దాయ‌కంగా ఉండేదేమో అంటూ సెటైర్స్ వేస్తున్నారు కొంద‌రు. 

More Related Stories