English   

2 మిలియ‌న్ క్లబ్బులో అజ్ఞాత‌వాసి.. 

agnyaathavaasi-collections

ఫ్లాప్ అన్నారు.. డిజాస్ట‌ర్ అన్నారు.. కానీ ప‌వ‌న్ రేంజ్ ఏంటో అజ్ఞాత‌వాసి మ‌రోసారి నిరూపించింది. డిజాస్ట‌ర్ టాక్ తో ఓపెన్ అయిన అజ్ఞాత‌వాసి.. ఓవ‌ర్సీస్ లో 2 మిలియ‌న్ వ‌సూలు చేసింది. దాన్నిబ‌ట్టే సినిమాపై ఎంత అంచ‌నాలున్నాయి.. ప‌వ‌న్ కు ఏ స్థాయి ఇమేజ్ ఉంది అనే విష‌యం అర్థం అవుతుంది. ఈ చిత్రం ప్రీమియ‌ర్స్ తోనే 1.5 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసి రికార్డులు తిర‌గ‌రాసింది. కానీ త‌ర్వాత సినిమాకు టాక్ తేడాగా రావ‌డంతో క‌లెక్ష‌న్లు ప‌డిపోయాయి. రెండో రోజు నుంచే వ‌సూళ్లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయి. అయినా కానీ ఓవ‌ర్సీస్ లో రికార్డులు సృష్టించింది అజ్ఞాత‌వాసి. బాహుబ‌లి కాకుండా ఓ తెలుగు సినిమా అతి త‌క్కువ టైమ్ లో 2 మిలియ‌న్ వసూలు చేసిన రికార్డ్ అజ్ఞాత‌వాసి పేరు మీద‌కు వెళ్లిపోయింది. ఈ చిత్రం 2 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసింది. అయితే అక్క‌డ సేఫ్ కావాలంటే తేవాల్సింది  4.5 మిలియ‌న్. అది జ‌ర‌గ‌దు.. కానీ 2 మిలియ‌న్ వ‌సూలు చేసిన అరుదైన జాబితాలో ప‌వ‌న్ కూడా చేరిపోయాడిప్పుడు. ఈయ‌న కంటే ముందు బాహుబ‌లి రెండు భాగాల‌తో పాటు ఖైదీ నెం.150, శ్రీ‌మంతుడు, ఫిదా, అ..ఆ.., నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలున్నాయి.
 

More Related Stories