English   

అజ్ఞాత‌వాసికి బాహు.. బలి అవుతుందా..? 

pawan-baahubali

ఏమో ఇప్పుడు అజ్ఞాత‌వాసి వ‌స్తోన్న తీరు చూస్తుంటే క‌చ్చితంగా సినిమా చాలా రికార్డుల షేపులు మార్చేలా క‌నిపిస్తుంది. ముఖ్యంగా తొలిరోజు అయితే చాలా రికార్డుల రుపురేఖలు మారిపోవ‌డం ఖాయం. ఓవ‌ర్సీస్ లో అయితే అరాచ‌కం చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అక్క‌డ హాలీవుడ్ సినిమా ల‌ను సైతం త‌న స్టామినాతో వెన‌క్కి నెట్టేస్తున్నాడు. జుమాంజీ 14 శాతం మూవీ టికెటింగ్ న‌డుస్తుంటే.. అజ్ఞాత‌వాసి మాత్రం 26 శాతంతో ముందు నిలిచింది. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా అజ్ఞాత‌వాసి అరాచ‌కానికి మాట‌ల్లేవు. ఇక్క‌డ విడుద‌ల‌వుతున్న తీరు చూస్తుంటే క‌చ్చితంగా నాన్ బాహుబ‌లి రికార్డులేవీ క‌నిపించ‌వు. కొన్ని చోట్ల బాహుబ‌లి 2ను కొట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇప్పటికైతే క‌చ్చితంగా ఒక్క నాన్ బాహుబ‌లి రికార్డ్ కూడా మిగిలిపోతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌డం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే క‌చ్చితంగా తొలిరోజు 30 కోట్ల షేర్ అందుకుంటుంద‌ని.. ఓవ‌రాల్ గా 40 కోట్ల‌కు పైగా తొలిరోజు షేర్ ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. 

ఈ చిత్ర బిజినెస్ ఒక‌టి రెండుకాదు.. ఏకంగా 120 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. అక్ష‌రాలా 120 కోట్ల షేర్ వ‌స్తే కానీ అజ్ఞాత‌వాసి సినిమాను హిట్ అన‌లేం. అంత రావాలంటే అద్భుతం చేయాల్సిందే.. సినిమా కూడా అద్భుతంగా ఉండాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. దానికి ఇప్పుడు ప్ర‌భుత్వాలు కూడా త‌మదైన సాయం చేస్తున్నాయి. జ‌న‌వ‌రి 10న ఏ థియేట‌ర్లో చూసినా మ‌న‌కు అజ్ఞాత వాసి త‌ప్ప మ‌రో సినిమా క‌నిపించ‌దు. అలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాత‌లు. బాహుబ‌లి 2 తెలుగులో తొలిరోజు 43 కోట్ల షేర్ సాధించింది. అది సాధించ‌డం మాత్రం చాలా క‌ష్టం. మొత్తానికి ఎటు చూసుకున్నా సెల‌వులు ముగిసే ఏడు రోజుల్లో క‌నీసం 80 కోట్ల షేర్ రాబ‌ట్టాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుందో చూడాలిక‌..!  

More Related Stories