English   

డిజాస్ట‌ర్ తోనే ఇలా ఉంటే.. హిట్ అయ్యుంటే..!

Agnyathavaasi-collections
2018-01-17 09:50:09

అజ్ఞాత‌వాసి సినిమా ఫ్లాప్ అయింది.. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు. అది ద‌ర్శ‌క నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు కాబ‌ట్టే ఎవ‌రూ బ‌య‌టికి కూడా రావ‌డం లేదు. కానీ ఈ ఫ్లాప్ సినిమాతోనే ప‌వ‌న్ కావాల్సిన‌న్ని రికార్డులు సెట్ చేస్తున్నాడు. తొలి షో నుంచే డిజాస్ట‌ర్ టాక్ తో ఓపెన్ అయిన ఈ చిత్రం తొలిరోజే 40 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇది నాన్ బాహుబ‌లి రికార్డ్. ఏ తెలుగు సినిమాకు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. ఇంకా మాట్లాడితే ఆ మ‌ధ్య స‌ల్మాన్ ఖాన్ టైగ‌ర్ జిందా హై కూడా తొలిరోజు 34 కోట్లే వ‌సూలు చేసింది. అది కూడా నెట్. కానీ ప‌వ‌న్ మాత్రం తొలిరోజు 40 కోట్ల షేర్ వ‌సూలు చేసి తాను తోపు అనిపించుకున్నాడు. ఇక త‌ర్వాత జోరు తగ్గించినా కూడా అజ్ఞాత‌వాసి రికార్డుల జాత‌ర మాత్రం ఆగ‌లేదు. విడుద‌లైన ఐదు రోజుల్లోనే 50 కోట్ల షేర్.. ఓవ‌ర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. 

విదేశాల్లో బాహుబ‌లి త‌ర్వాత అత్యంత వేగంగా 2 మిలియ‌న్ మార్క్ అందుకున్న తెలుగు సినిమా ఇదే. ఖైదీ నెం.150కి కూడా ఇది సాధ్యం కాలేదు. ఈ టాక్ తోనే సినిమా అక్క‌డ 2 మిలియ‌న్ వ‌సూలు చేసింది. ఒక‌వేళ సినిమాకు హిట్ టాక్ వ‌చ్చుంటే క‌చ్చితంగా 5 మిలియ‌న్ మార్క్ అందుకునేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు ట్రేడ్ విశ్లేష‌కులు. అస‌లు బాహుబ‌లా.. ప‌వ‌న్ క‌ళ్యాణా అనేది తేలిపోయేద‌ని అంటున్నారు వాళ్లు. కానీ ఏం చేస్తాం.. సినిమా ఫ్లాప్. ఇక ఇండియాలోనూ అజ్ఞాత‌వాసి ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. కానీ టాక్ తేడాగా ఉండ‌టంతో త‌ర్వాత నెమ్మ‌దించింది. ఇలాంటి దారుణ‌మైన టాక్ తోనే తొలి 6 రోజుల్లోనే 85 కోట్ల గ్రాస్.. 52 కోట్ల షేర్ వ‌సూలు చేసింది అజ్ఞాత‌వాసి. ఒక‌వేళ ఈ చిత్రం గానీ హిట్ అయ్యుంటే ఎన్ని రికార్డుల‌కు మూడేదో మ‌రి..!

More Related Stories