English   

నిహారిక పెళ్లికి పూర్తైన ఏర్పాట్లు.. 

niharika
2018-01-13 14:34:24

అదేంటి.. నిహారిక‌కు పెళ్లా..? అప్పుడే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయా..? మ‌ర‌దేంటి.. క‌నీసం ఒక్క మాట కూడా ఎవ‌రికీ చెప్ప‌లేదు.. హింట్ కూడా ఇవ్వ‌లేదు క‌దా మెగా ఫ్యామిలీ అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉందండోయ్..! కొణిదెల నిహారిక పెళ్లికూతురు అవుతున్న మాట వాస్త‌వమే కానీ అది రియ‌ల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. చాన్నాళ్ల కింద ఒక మ‌న‌సు సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ భామ‌. కానీ అది డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో న‌టిగా తాను ఎంతో ఎత్తుకు ఎదుగుతాన‌ని ఆశించిన నిహా ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. దాంతో ఒక మ‌న‌సు త‌ర్వాత నిహారిక పూర్తిగా క‌నిపించ‌డం మానేసింది. త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లిపోయి అక్క‌డ విజ‌య్ సేతుప‌తితో ఒరు న‌ల్ల‌నాల్ పాతు సొల్రెన్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. 

ఒక మ‌న‌సు ఫ్లాప్ త‌ర్వాత తెలుగులో అస‌లు సినిమాలు చేస్తుందా.. చేయ‌దా..? అనే ప్ర‌శ్న‌కు తెర‌దించుతూ కొత్త ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తుంది నిహారిక‌. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్నాడు. యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. సైలెంట్ గా ప‌ని పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది. దీంతో పాటు ఆ మ‌ధ్య దుర్గా ప్ర‌సాద్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమాకు ముహూర్తం పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. దీనికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తుంది. మొత్తానికి ఒకేసారి త‌క్కువ గ్యాప్ లో రెండు సినిమాలు చేస్తుంది కొణిదెల వార‌మ్మాయి.

More Related Stories