బెల్లంకొండ గణేష్ కి హీరోయిన్ గా అంత చిన్న పాపా

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యారు. ఇప్పుడు సురేష్ రెండో కుమారుడు, సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో గణేష్ బెల్లకొండ తన తొలిచిత్రం చేస్తున్నారు. ఇదొక ప్రేమకథా చిత్రం. బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్, లక్కీ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ స్క్రిన్ప్లేను అందిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్‌కు వెళ్లనుంది.
అయితే ఈ సినిమాలో గణేష్ కు జోడీగా కనిపించబోయే హీరోయిన్ పాత్ర కోసం ఓ టీనేజ్ పాపను పెట్టాలనే యోచనలో ఉందట యూనిట్. ఆమె టీనేజ్ పాప మరెవరో కాదు.. ‘మజిలీ’ సినిమాలో నాగచైతన్య ట్రైనింగ్ ఇచ్చే అనన్య అగర్వాల్. 16 ఏళ్ల ఈ నటి ఇప్పటికే బాలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించింది. ‘మజిలీ’లో నాగచైతన్యకు పెంపుడు కూతురిగా కనిపించి మెప్పించింది. ఇప్పుడీ భామనే గణేష్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారని అంటున్నారు. ఆమె చిన్నదే అయినప్పటికీ చూడటానికి కాస్త ఎక్కువ వయసున్న దానిలాగే కనిపిస్తుంది. అందుకే ఈ పాత్ర కోసం ఆమెనే అనుకుంటున్నారట. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.