అర్జున్ కూతురు బాగా తెగించిందిగా.. ఐశ్వర్య సో హాట్..

సౌత్ ఇండస్ట్రీలో వారసురాళ్లు రావడం తక్కువే. వచ్చినా నిలబడేది కూడా తక్కువే. కానీ ఇప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు వస్తూనే ఉన్నారు. అందులో ఐశ్వర్య అర్జున్ కూడా ఉంది. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతుంది. అందాలన్నీ పెట్టుబడిగా పెట్టి దుమ్ము దులిపేస్తుంది ఈ బ్యూటీ. 38 ఏళ్లుగా ఈయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు అర్జున్. దాంతో తన కూతురును హీరోయిన్ చేయాలంటే ఏమేం చేయాలో ఆయనకు తెలియంది కాదు. అందుకే నాన్న కూచిగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా వచ్చిన తర్వాత మాత్రం గ్లామర్ షోలో కుమ్మేస్తుంది ఈమె. కానీ అవకాశాలు మాత్రం అనుకున్నట్లుగా రావడం లేదు. 20 ఏళ్ల వయసులోనే హీరోగా వచ్చాడు అర్జున్. అప్పట్నుంచీ ఇక్కడ పరిస్థితులు చూస్తున్నాడు.
ఇక్కడ వాతావరణం కూడా అర్జున్ కు కొత్తకాదు. ఈయన కూతురు ఐశ్వర్య కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉంది. హీరోయిన్ గా కూడా రెండు మూడు సినిమాలు చేసింది. అయితే తెలుగులో మాత్రం ఇప్పటి వరకు ఈమె అడుగు పెట్టలేదు. దాంతో టాలీవుడ్ ఎంట్రీ కోసం ఐశ్వర్య అర్జున్ సిద్ధమవుతుంది. 2013లో విశాల్ హీరోగా వచ్చిన 'పట్టాత్తు యానాయ్' సినిమాతో కోలీవుడ్ కు వచ్చింది ఈమె. ఆ తర్వాత 'ప్రేమ బరాహ' సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈమె అడుగు పెడుతుంది. ఈమె తొలి తెలుగు సినిమాను అర్జున్ డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఓ పేరున్న నిర్మాణ సంస్థతో కలిసి అర్జున్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త హీరోయిన్లను తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ తీసుకున్నా కూడా మల్టీస్టారర్ సినిమాల్లోనో లేకపోతే సెకండ్ హీరోయిన్గానో తీసుకుంటున్నారు. అందుకే కూతురు కెరీర్ బాధ్యతలు అర్జున్ స్వయంగా తీసుకుంటున్నాడు.