అరవ హీరోతో అఖిల్ దోస్తానా.. వైరల్ అవుతున్న ఫోటోస్..

పేరుకు తెలుగు, తమిళ హీరోలని వేర్వేరుగా ఉంటాయి కానీ అంతా ఒక్కటే. భాష అనే బౌండరీని మన హీరోలు ఎప్పుడో చేరిపేసారు. తమిళ, తెలుగు ఇండస్ట్రీలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అక్కడి హీరోలకు మనోళ్లతో.. మనోళ్లకు వాళ్లతో మంచి స్నేహం ఉంది. ఇప్పుడు అఖిల్ కూడా మరోసారి దీన్ని ప్రూవ్ చేసాడు. హైదరాబాద్ కు వచ్చిన 'రెమో' హీరో శివ కార్తికేయన్ కు తన ఇంట్లో సూపర్ డిన్నర్ ఇచ్చాడు. ప్రస్తుతం మిత్రన్ దర్శకత్వంలో శివ ఓ సినిమా చేస్తున్నాడు. దీని టైటిల్ 'హీరో'. కల్యాణి ప్రియదర్శిన్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. 2019 డిసెంబర్లో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ మధ్యే నమ్మ వీట్టు పిల్లై సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు శివకార్తికేయన్. ఇప్పుడు ఇదే జోరులో మిత్రన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ సినిమా.. శివ సినిమాలు ఒకేచోట షూటింగ్ జరుపుకుంటున్నాయి. అప్పుడు కలుసుకున్న ఫోటోలు ఇవి. పైగా తన ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యమిచ్చాడు అఖిల్ అక్కినేని. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నాడు అఖిల్. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతగోవిందం ఫేమ్ జీఏ 2 ప్రొడక్షన్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుందని తెలుస్తుంది.