పెళ్ళికి సిద్దమయిన అమలా పాల్ మాజీ భర్త

మలయాళ కుట్టి అమలా పాల్ మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. నిజానికి వీరిద్దరూ 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. కొద్దిరోజుల్లోనే వీరి మధ్య మనస్పర్థలు కలహాలు, వ్యక్తిగత కారణాలతో వాళ్లు విడిపోయారు. వారిద్దరూ విడిపోయిన తర్వాత అమలా పాల్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుండగా, విజయ్ దర్శకుడిగా కొనసాగున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విజయ్ తో హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి జరగనుందని వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆయన వాటిని ఖండించాడు కూడా. అయితే తాజాగా ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ఆయన త్వరలోనే డాక్టర్ ఐశ్వర్య అనే ఆమెని వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. మన్నివక్కమ్ ప్రాంతానికి చెందిన ఆ డాక్టర్ ను పెళ్లాడబోతున్నానని, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని ఆయన కూడా స్పష్టంచేశాడు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట రిలీజ్ చేసాడు. అలాగే పెళ్లి పనుల్లో తనకు సహకరిస్తున్న మీడియాకు కూడా కృతఙ్ఞతలు తెలిపాడు విజయ్. తన ప్రెస్ నోట్ లో పెళ్లి తేదీని మాత్రం విజయ్ చెప్పలేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు ఆయన జులై 11న ఐశ్వర్యను పెళ్లాడబోతున్నాడట.