English   

అయ్యో పాపం.. A స‌ర్టిఫికేట్ సినిమాలు చేస్తున్న మెగా హీరోయిన్.. 

Amala Paul
2019-06-04 18:33:28

మెగా హీరోయిన్ అంటే ఎవ‌రో అనుకునేరు.. చ‌ర‌ణ్, బ‌న్నీ లాంటి హీరోల‌తో న‌టించిన అమ‌లాపాల్ గురించే ఇక్క‌డ చ‌ర్చ‌. ఈ భామ‌కు ఏదో అయిపోయింది. లేక‌పోతే మ‌రేంటి.. ఆమె హీరోయిన్ గా ఉన్న‌పుడు కూడా ఇంత గ్లామ‌ర్ షో ఎప్పుడూ చేయ‌లేదు. ఇక విజ‌య్ ను పెళ్లాడిన త‌ర్వాత సినిమాల‌కే దూర‌మైంది. కానీ విడాకుల త‌ర్వాత మాత్రం అమ‌లాపాల్ ను ఆప‌త‌రం కావ‌ట్లేదు ఎవ‌రికీ. అస‌లు ఈ భామ‌కు భ‌ర్తపై ఉన్న కోపమో.. లేదంటే మ‌రే కార‌ణ‌మో ఏమో గానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రెచ్చిపోతుంది. ఇదివ‌ర‌క‌టి కంటే రెండింత‌లు అందాలు ఆర‌బోస్తుంది. ప్ర‌స్తుతం ఈమె ఆడై సినిమాలో న‌టిస్తుంది. ర‌త్న‌కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తైపోయింది. అప్ప‌ట్లో విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ సంచ‌ల‌నం సృష్టించింది. 

వైట్ అండ్ వైట్ లో అమ్మ‌డు ఫుల్లుగా అందాలు ఆర‌బోస్తూ రెచ్చిపోయింది. ఇది చూసిన త‌ర్వాత అమ‌లాపాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అవ‌కాశాల కోసం ఎంత దూరం వెళ్లిపోయిందో అర్థ‌మైపోతుంది. పెళ్లికి ముందు కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో అందాలు ఆరబోయ‌లేదు అమ‌లా. కానీ ఇప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. ఆడై సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ స‌భ్యులు. సినిమాలో అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉన్నందుకే A స‌ర్టిఫికేట్ ఇవ్వాల్సి వ‌చ్చిందంటున్నారు వాళ్లు. పైగా ఈ మ‌ధ్య ప్ర‌తీ సినిమాలోనూ ఇలా రెచ్చిపోవ‌డం అల‌వాటు చేసుకుంది అమ‌ల‌. సినిమాల‌తో పాటు జిమ్ వ‌ర్క‌వుట్స్ కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఈ భామ‌. మొత్తానికి A స‌ర్టిఫికేట్ సినిమాల‌తో హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది అమ‌లాపాల్.

More Related Stories