మహేష్ బాబుకు అనిల్ రావిపూడి ఫ్యామిలీ వీడియో మెసేజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకేక్కిన సరిలేరు నీకెవ్వరు్ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడంతో దాదాపు అన్ని చోట్లా నుండి భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుందీ చిత్రం. అయితే మునుపెన్నడూ లేని విధంగా డైరెక్టర్ ఫ్యామిలీ మహేష్ కి విషెస్ చెప్పింది. అలాగే ధన్యవాదాలు కూడా.
ఓ వీడియో ద్వారా అనిల్ కుటుంబ సభ్యులు మహేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు. సంక్రాంతి పండగకి ముందే బ్లాక్‌బస్టర్ కా బాప్ ఇచ్చారని, అనిల్‌కు అవకాశం ఇచ్చినందుకు అనిల్ కుటుంబ సభ్యులమైన తమ తరపున కృతజ్ఞతలంటూ ఈ వీడియోలో అనిల్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ వీడియోను మహేష్ భార్య నమ్రత తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసి అనిల్ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పారు. తమకు బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు అనిల్ కు థ్యాంక్స్ చెప్పారు. ఏదైనా తమదే గొప్పతనం అనుకోకుండా ఎవరికీ వాళ్ళు థాంక్స్ చెప్పుకోవడం కాస్త ఆసక్తికరంగానీ మారింది.