మహేష్ బాబు ఋణం తీర్చుకుంటా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' ప్రారంభమైంది. వరుస విజయాలతో ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా లాంచ్ అయింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది. దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్రయూనిట్. ఇక లాంచ్ లకి హాజరు కాకుండా ఉండే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ఈ సినిమా లాంచ్ కి కూడా మహేష్ హాజరు కాలేదు. ఈ లాంచ్ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని, ఈ అవకాశాన్ని ఇచ్చిన మహేశ్ బాబుగారిని ఎప్పటికీ మరిచిపోలేననీ ఈ సినిమాతో ఆయనకి హిట్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో 13 సంవత్సరాల తరువాత విజయశాంతిగారు రీ ఎంట్రీ ఇస్తున్నారని తన మీద నమ్మకం ఉంచి ఆమె ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు అని ఆయన చెప్పుకొచ్చారు.