నెల్లూరు మ్యూజిక్ పాఠశాలకు ఎస్పీ పేరు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలలకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరు పెట్టడంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు చరణ్ ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. కాగా నెల్లూరులోని ప్రభుత్వ సంగీత పాఠశాలలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా మైసూరు విశ్వవిద్యాలయంలో ఎస్పీ బాలు పేరుతో అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నారు. యూనివర్సిటీ విసి హేమంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలు జీవిత సాధలను, పాటలను భవిష్యత్ తరాలకు అందించేలా ఈ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని విసి పేర్కొన్నారు. దానికోసం రూ.5లక్షలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.