గద్దలకొండ గణేష్ అధర్వ హీరోగా మరో సినిమా

ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సక్సెస్ ని వాడుకోవడంలో ముందుంటారు మన తెలుగు వాళ్ళు. నిన్న మొన్నటి దాకా అధర్వ మురళి అంటే ఎవరో తెలీదు. కానీ ఆయన నటించిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన దశ కూడా తిరిగినట్టుంది. ఇప్పటి దాకా తమిళ్ మార్కెట్ కే పరిమితం అయిన ఆయన సినిమాలు తెలుగు వంక కూడా చూస్తున్నాయి. ఇటీవల ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో దర్శకుడు కావాలనుకునే యువకుడు అభిలాష్ గా మెప్పించారు తమిళ హీరో అధర్వ మురళి. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఆయన నటించిన తమిళ సినిమా ఒకదాన్ని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
తమిళంలో ‘బూమరాంగ్’ పేరుతో ఉన్న సినిమా అదే టైటిల్‌తో తెలుగులో కూడా అనువాదమవుతోంది. ఇందులో మేఘా ఆకాష్, ఇందూజ రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ రీమేక్ ల దర్శకుడు ఆర్.కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాని దసరా కానుకగా వచ్చే నెలలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సైరా సహా చాలా తెలుగు సినిమాలు డేట్ లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. వాటి మధ్య ఈ సినిమా ఏమేరకు నెట్టుకు రాగలుగుంది ? అనేది చూడాలి.