బాలయ్య న్యూ లుక్...అదిరిందిగా

సినిమా అన్నా అందులో పాత్ర అయినా ప్రాణం పెట్టి చేసే నటుల్లో బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న రూలర్ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేసిన ఆయన తన లుక్ మళ్ళీ మార్చేశాడు. సరికొత్తగా గుండుతో దర్శన మిచ్చి ఫ్యాన్స్‌ను సాధారణ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసాడు.
బోయపాటి శ్రీను సినిమా కోసమే బాలయ్య కొత్తగా కనిపించడం అని అంటున్నారు. వైట్ అండ్ వైట్ ఖాదీ బట్టలు, బ్లాక్ షూతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఈ లుక్‌ను బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పాత్ర కోసం విగ్‌లు వాడే బాలయ్య ఇపుడు బోయపాటి శ్రీను సినిమా కోసం గుండుతో కనిపిస్తున్నారని చెబుతున్నారు.
అయితే, ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ దిగారనే విషయం మాత్రం తెలియరాలేదు. నిజానికి నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు అది కూడా కీలకమైన రాజధాని విషయంలో సమావేశం అవుతుండడంతో టీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనాలని విప్ జారీ చేసింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బాలయ్య విజయవాడ వెళ్లారు. ఇది అక్కడే తీసి ఉండవచ్చని అంటున్నారు. ఇక త్వరలో బాలయ్య, బోయాపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.