సీక్రెట్ గా పరీక్షలు రాస్తోన్న ఆనుపమా...అసలు విషయం ఇదీ

పంచం ఎంత ముందుకు వెళ్తున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం తమ అలసత్వాన్ని వదలడం లేదు. అలాంటి అలసత్వమే ఇప్పుడు అనుపమను వార్తల్లోకిప్ర ఎక్కించింది. అదేంటంటే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బిహార్‌లో సీక్రెట్‌గా టెట్ ఎగ్జామ్ రాస్తోందా..?. అనే అనుమానం కలిగించేలా ఒక హాల్ టికెట్ వైరల్ అవుతోంది. అయితే ఆమె అలాంటిదేమీ రాయడం లేడట.
బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్లక్ష్యానికి రిజల్ట్ మాత్రం ఆమె ఫోటోతో వచ్చిన ఆ హాల్ టికెట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్ లో యువకుడి ఫోటోకు బదులు అనుపమ ఫోటో వచ్చిందన్న మాట. బిహార్ లోని మక్దుంపుర్లో నివశించే రిషికేశ్ కుమార్ టీచర్ పోస్ట్‌కు అర్హత సాధించేందుకు ఎస్టెట్ ఎగ్జామ్‌కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. జనవరి 28న జరిగే ఎగ్జామ్ కోసం ఆయన గట్టి కసరత్తులే చేశాడు. ఇంకా సమయం ఉండడంతో రేడీగా ఉన్నాడు, అయితే పరీక్ష దగ్గర పడిన నేపథ్యంలో..ఆన్లైన్లో హాల్ టికెట్లు విడుదల చేసింది బోర్డు.
తన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న రిషికేశ్ షాక్ తిన్నాడు. దానిలో వివరాలన్నీ తనవే ఉన్నాయి కానీ ఫోటో మాత్రం అనుపమ పరమేశ్వరన్‌ది ఉంది. బీహారోడు కదా ఆమె ఎవరో తెలియక ఎవరో అమ్మాయి ఫోటో ఉందనుకుని వెంటనే అధికారులను సంప్రదించాడు. వారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ హాల్ టికెట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.