తమ్ముడు పవన్ స్టైల్ ఫాలో అవుతున్న చిరంజీవి..

కొన్ని విషయాల్లో మెగా హీరోలు తెలియకుండానే పవన్ కళ్యాణ్ ని ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అయితే పవర్ స్టార్ పద్ధతిని దించేస్తున్నారు. ఎక్కడైనా స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చిన తర్వాత కచ్చితంగా జై హింద్ అంటూ ముగిస్తాడు పవన్ కళ్యాణ్. ఇది ఆయనకు ఇప్పటినుంచి కాదు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న అలవాటు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్టేజీ ఎక్కి మైకు తీసుకున్నా కూడా చివర్లో జైహింద్ అనకుండా దిగడు. ఇదే తమ అలవాటుగా మార్చుకున్నారు మెగా హీరోలు కూడా. కానీ చిరంజీవి మాత్రం చివర్లో ఎప్పుడు అలా చెప్పలేదు.
ఇప్పుడు సైరా నరసింహారెడ్డి పుణ్యమా అని ఈయన కూడా పవన్ కళ్యాణ్ అలవాటును తన అలవాటుగా మార్చుకున్నాడు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తర్వాత జైహింద్ అంటూ ముగించాడు చిరంజీవి. ఇప్పుడు అదే సినిమా థాంక్స్ మీట్ లో కూడా చివర్లో మళ్లీ జైహింద్ అంటూ ముగించాడు మెగాస్టార్. ఇది కచ్చితంగా పవన్ ను ఫాలో అవటమే అంటున్నారు అభిమానులు.
పవర్ స్టార్ పొలిటికల్ గా సక్సెస్ అయినా కాకపోయినా కూడా ఎప్పుడు దేశంపై తన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. సినిమాల్లో ఉన్నప్పుడు కూడా జైహింద్ అంటూ తన ప్రతి స్పీచ్ ముగిస్తాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మెగా హీరోలు కూడా అంతా ఇదే అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఇండస్ట్రీలో నితిన్, శర్వానంద్ లాంటి హీరోలు కూడా చివర్లో జైహింద్ అంటూ ముగించడం విశేషం.