సూపర్ స్టార్ కోసం మెగాస్టార్...లెక్క తప్పింది !

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. తాజాగా షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా మొదలు పెట్టింది. జనవరి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీని కోసం భారీ ఏర్పాట్లు చేయాలని మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా ఈ ఈవెంట్ అప్డేట్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నేడు ఓ మైల్ స్టోన్ అనౌన్స్మెంట్ రానుందని వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించినప్పటి నుండి ఆ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు వారి ఆతృతకు తెరదించుతూ సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి ఆ అప్డేట్ ఇచ్చారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అతిథి ఎవరనేది మహేష్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 5న జరగనున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు మహేష్ బాబు అలాగే వెంకటేశ్వర క్రియేషన్స్ వారు ప్రకటించారు. ‘‘సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవి గారికి ధన్యవాధాలు. మీరు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపు అయ్యింది. మిమ్మల్ని కలవడానికి ఎంతోగానో ఎదురు చూస్తున్నా’’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.