దర్బార్ కి థియేటర్ల కష్టమే...అయినా తగ్గట్లేదుగా

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు దిగుతున్నాయి. సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం వుంటే నాలుగు సినిమాల్లో ఒకటి ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒక యంగ్ హీరో సినిమా వస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములోతో, నందమూరి కల్యాణ్‌రామ్ ఎంత మంచివాడవురా సినిమాలతో వస్తున్నారు. ఈ మూడు తెలుగు సినిమాలతో పాటుగా తమిళ్ డబ్బింగ్ మూవీ దర్బార్ కూడా రేసులో వుంది.
రజనీకాంత్, మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న దర్భార్ షూటింగ్ లేటుగా మొదలైనా సంక్రాంతి రేసులో ఉన్న అందరికంటే ముందే షూటింగ్ పూర్తిచేసేశారు. దర్బార్ మూవీలో రజనీకాంత్ పోలీస్ గెటప్‌తో కనిపిస్తున్నాడు. రోబో తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చూసిన రజనీ పేట సినిమాతో మళ్ళీ సక్సెస్ చూశాడు. పేట తమిళంలో హిట్ అయినా తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. దీంతో దర్బార్ తో తెలుగులో మళ్ళీ సక్సెస్ చూడాలన్న ఆశతో వున్నాడు సూపర్‌స్టార్.
సంక్రాంతి బరిలో మహేశ్... బన్నీ వంటి స్టార్స్ ఉండడం అదీ కాకా దిల్ రాజు, అల్లు అరవింద్ లు ఆ సినిమాల నిర్మాతలుగా ఉండడంతో దర్బార్‌కు కావాల్సినన్ని థియేటర్స్ దొరకవనేది బహిరంగ రహస్యం. అయినా దర్బార్ నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు ఎలా అయినా సంక్రాంతికి వచ్చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే రజనీకాంత్ కి ఈమధ్యకాలంలో తెలుగులో 10 కోట్లు కూడా కలెక్ట్ చేయడం గగనమైపోతోంది. అందుకే తెలుగు మార్కెట్ కోసం పాకులాది సంక్రాంతికి సినిమా రాకుండా వాయిదా వేస్తే తమిళంలో అసలుకే మోసం వస్తుంది. అందుకే పోటీ ఎంతున్నా వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు