English   

జగన్ గెలిచిన సంతోషంలో పూరీ జగన్ భావోద్వేగ లేఖ....జీవితాంతం రుణపడి ఉంటాడట 

puri
2019-05-26 17:43:17

ఏపీ ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్‌ ని డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఒక రేంజ్ లో ఆకాశానికి ఎత్తేశారు. తిరుగులేని మెజార్టీతో వైసీపీ విజయం సాధించనందుకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. అదేంటి ఆయన ఈయనకు రుణపడి ఉండడం ఏమిటని అనుకుంటున్నారా ? దానికి కారణం ఏంటంటే పూరీ జగన్నాథ్ తమ్ముడు ఉమా శంకర్ గణేష్ విశాఖజిల్లా నర్సీపట్నం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అది కూడా మంత్రి అయ్యన్నపాత్రుడిపై బంపర్ మెజార్టీతో. అందుకే పూరీ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పూరీ పేర్కొన్న ట్వీట్ యధాతదంగా ‘ఎలక్షన్‌ రిజల్ట్స్‌ వచ్చిన రోజు నేను వైజాగ్‌లో ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరం కలిసి టీవీలో రిజల్ట్స్‌ చూస్తున్నాం. ఎందుకంటే నా తమ్ముడు ఉమా శంకర్‌ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి వైఎస్సార్‌ సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఫలితాలు ఎంతో టఫ్‌గా ఉంటాయని ఊహించిన మాకు వార్‌ వన్‌ సైడ్‌ అయ్యేసరికి మతిపోయింది. ఏపీ ప్రజలందరూ సీక్రెట్‌గా మీటింగ్‌ పెట్టుకుని జగన్‌నే ఎన్నుకుందాం అని కూడబలుక్కొని ఓట్లు వేసినట్లు అనిపించింది. ఇన్ని కోట్లమంది ఒకేసారి ఒక మనిషిని నమ్మటం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్నవిషయం కాదు.

హ్యాట్సాఫ్‌ టు జగన్‌ మోహన్‌రెడ్డిగారు’. ఎందుకంటే కొండలాంటి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోయిన తర్వాత తాను ఒంటరి వాడయ్యాడు. రాజ్యం పోయింది. అందరూ మోసం చేశారు. ఎన్నో అవమానాలు. ఎన్నో కష్టాలు. ఎన్నో నెలల జైలు జీవితం. తండ్రి పేరు నిలబెట్టాలన్నా, రాజన్న రాజ్యం తీసుకురావాలన్నా మరో ఐదేళ్లు ఎదురుచూడటం. ఎంత కష్టం. జగన్ చేసింది ఒక్కరోజు ఎన్నికలు కాదు పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహం నింపుతూ రాజన్న ఎత్తున్న తల్వార్ ను పట్టుకుని పదేళ్ల పాటు యుద్ధరంగంలో నిలుచున్న యోధుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో చూశానని ‘జగన్ మొహంలో విజయగర్వం లేదు. ఇన్ని తలలు నరికాను అన్న పొగరు లేదు. కామ్ గా ఉన్నాడు. సేద తీర్చుకుంటున్నాడు

. ముఖంలో గెలుచుకున్న సీఎం పదవి కంటే ఆయనకు పొడిచిన వెన్నుపోట్లే కనిపించాయి. ఒంటరిగా ఎన్నోసార్లు ఏడ్చిన కన్నీళ్లు కనిపించాయి. వాళ్లింట ఆడవాళ్ల వేదనలు కనిపించాయి. ఏది ఏమయినా రాజన్న కొడుకు అనిపించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ యోధుడు. ఎన్నికల్లో విజయం తర్వాత ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం కారణంగా ఈ విజయం వచ్చిందని జగన్ చెప్పాడు. నిజానికి దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయం గొప్పదని నేను నమ్ముతాను. ప్రజలను మార్చడంలో దేవుడు ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రజలు దేవుళ్లను మార్చగలరు. ఇన్ని కోట్ల మంది చేతులు ఎత్తి ఎవరికి మొక్కితే వాళ్లే దేవుడు. అందరూ కలిసి జగన్ గారికి ఈరోజు మొక్కేశారు’  నా తమ్ముడికి జగన్ అంటే ప్రాణం ‘జగన్ ఫొటో చూసినా, వీడియో చూసినా తెగ ఎగ్జైట్ అయిపోతాడు. ఓ సూపర్ స్టార్ లా చూస్తాడు. వాడలా ఎందుకు చూస్తాడో ఇవాళ నాకు అర్థమయింది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా మళ్లీ భుజం తట్టి చేయి పట్టుకుని యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని అందించిన జగన్ గారికి నేను, నా కుటుంబం రుణపడి ఉంటామని పూరీ జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించారు.

More Related Stories