English   

పాత బస్తీలో డిస్కో ఆడిస్తున్న డిస్కో రాజా

ravi
2019-06-16 10:55:32

ఎన్నో ఫ్లాప్స్ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ నిలదొక్కుకోడానికి రవితేజ హీరోగా నటిస్తున్న తాజా మూవీ డిస్కోరాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఇంతకుముందు రవితేజతో నేల టిక్కెట్ సినిమా నిర్మించిన రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యాక కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది అయితే అదేమీ లేదని సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వకుండా సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టింది. ఇక మే 27 న మొదలయిన ఈ షెడ్యూ లో రవితేజ, వెన్నెల కిషోర్‌ల మధ్య కీలక సీన్స్ ని రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించారు. ఆతర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. అదేవిధంగా పాతబస్తీలో రవితేజ, ఇతర నటీనటుల మధ్య ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.  ఇక త్వరలోనే హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేయనున్నారట, ఈ సెట్ లో మేజర్ షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారని సమాచారం. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందట, కానీ ఆమె గురించి ఇంకా బయటపెట్టలేదు.  బాబీ సింహా, సత్య, సునీల్, రాంకీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories