డేట్ లాక్ చేసుకున్న మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా క్షణం ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా డిస్కోరాజా. పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ప్రీ లుక్స్ తప్ప ఈ సినిమా నుండి ఎటువంటి లుక్ రిలీజ్ కాలేదు. ఇటీవల ఓక పిక్ రవితేజదే అని హల్చల్ చేయగా అది ఆయన కాదని తేల్చింది సినిమా యూనిట్. ఈ క్రమంలో ఈ చిత్ర టీజర్ సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా రివీల్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతే కాక ఈ సినిమాని కూడా డిసెంబర్ 20,2019న విడుదల చేయనున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. మరోపక్క నితిన్, రష్మిక హీరోహీరోయిన్స్ గా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `భీష్మ` సినిమా కూడా క్రిస్మస్ కే విడుదల కాబోతున్నట్టు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇక ఆ సమయానికే ఈ సినిమా కూడా ప్రకటించడంతో రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని అంటున్నారు. చాలాకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు హిట్ ఇస్తుందో లేదో మరి.