English   

బన్నీకి అలియా భట్ లేదా దిశా కావాలట !

allu
2019-08-23 20:59:17

తెలుగు సినిమా స్థాయి పెరిగింది, దాదాపుగా స్టార్ హీరోల సినిమాలు అన్నీ రెండు మూడు బాషలల్లో రిలీజ్ అవుతున్నాయి. అందుకే మనవాళ్ళు హీరోయిన్స్, లేదా ఇతర కాస్టింగ్ ని వేరే బాషల నుండి తెస్తున్నారు. ఎక్కువగా తమిళ మళయాళ హీరోయిన్స్ ని తెచ్చేవారు. కానీ అవి రెండు కలిపినా సరే బాలీవుడ్ కంటే ఎక్కువ కాలేదు అందుకే  ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్స్ వెనక పడుతున్నారు. ఎప్పుడైతే అలియా భట్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సంతకం చేసినప్పటి నుండి ఆమె తెలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని భావిస్తున్నారు. ఇక ఎటూ సాహో సినిమాలో శ్రద్దా కపూర్ నటిస్తోంది, ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాట్ భామ దిశా పటానితో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
 అలియా భట్ లేదా దిశా పటాని లలో ఎవరో ఒకరిని తన తాజా ప్రాజెక్ట్ కోసం ఒప్పించమని బన్నీ కోరాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని లైన్ లో పెట్టాడు. అదే ఎంసీఏ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ అనే దర్శకుడుతో ఒకే చేసిన ఐకాన్ సినిమా. దిల్ రాజు కామ్పుండ్ లో ఉన్న ఈ దర్శకుడితో చేసే ఐకాన్ సినిమాకి అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఆమె వలన ఆర్ఆర్ఆర్ కి అవుతున్న డిలే చూసి దిల్ రాజు దిశా పటానిని తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం మొదలయ్యింది. ఇక ఈ భామ పూరీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే .

 

More Related Stories