వర్మ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. మార్షల్ ఆర్ట్స్‌లో పేరుగాంచిన బ్రూస్లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా బాలేకర్ కీలకపాత్ర పోషిస్తోంది. మొన్న బ్రూస్లీ 80వ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను ఆర్జీవీ ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఇక ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ ట్రైలర్‌ను వచ్చే నెల 13వ తేదీన విడుదల చేస్తామని రామ్ గోపాల్‌వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు. బ్రూస్లీ నివసించిన చైనాలోని ఫోషన్ సిటీలో ఈ ట్రైలర్ విడుదల నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని రోజులకు వర్మ ఒక మంచి సినిమాతో వస్తున్నాడన్న ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని వర్మ పేర్కొన్నారు. ఇందులో హీరో హీరోయిన్లు ఉండగా ఇప్పుడు తాజాగా హీరోయిన్ బ్రూస్ లీని లవ్ చేస్తున్నట్టు కొత్త పాయింట్ చెప్పారు వర్మ. ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయితే ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.