ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ తమిళ సినీ గీతరచయిత ముత్తువిజయన్ కన్నుమూశారు. ఎన్నో హిట్ సినిమాలకు పాటలు రాసిన ఈయన కవయిత్రి తేన్మొళిని ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాలతో విడిపోయారు. నటుడు విజయ్ నటించిన తుళ్లాద మనం తుళ్లుం చిత్రం(తెలుగులో నువ్వు వస్తావని రీమేక్) ద్వారా గీత రచయితగా పరిచయం అయ్యారు. అందులో మెఘామాయ్ వందు పోగిరేన్, విన్నిలా ఉన్నైతేడినేన్ అనే పాటలు ముత్తువిజయన్కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత పెన్నిన్మనదై తొట్టు సినిమాలో కన్నుకుళ్లే ఉన్నై వైత్తేన్ పాట ముత్తువిజయన్ను మరింత పాపులర్ చేసింది. అలా సినిమా ఇండస్ట్రీలో 800లకు పైగా పాటలు రాసిన ముత్తుకుమార్ అక్కడితోనే ఆగిపోక కొన్ని సినిమాలకి మాటల రచయితగానూ, అసిస్టంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. కొన్నేళ్ళ నుండి చెన్నైలోని వలసరవాక్కంలోని సినీ గీత రచయితల సంఘం ఆఫీస్ లోనే ఉంటున్న ముత్తువిజయన్ పచ్చ కామెర్ల బారిన పడడంతో లివర్ దెబ్బతింది. దీంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యి అందుకు వైద్య చికిత్స పొందుతున్న ముత్తువిజయన్ తుదిశ్వాస విడిచారు. ముత్తువిజయన్ మృతిపట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.