కొత్త అవతారంలో సత్తి..గరంగరంగా ఏమి చేస్తాడో

ఏ మాత్రం ఉపయోగం లేదని భావించి టీవీ9 కొత్త మేనేజిమెంట్ బిత్తిరి సత్తిని పొమ్మనలేక పొగబెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయన సాక్షి ఛానెల్ లో చేరాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తనకు మాత్రమే సాధ్యమయిన మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బిత్తిరి సత్తి.. సాక్షిలో గరంగరం వార్తలు అనే కార్యక్రమంతో అలరించబోతున్నాడు. ప్రతి రోజూ రాత్రి 8 : 30 నిమిషాలకు, తిరిగి మరుసటి రోజు ఉదయం 8 : 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం కానున్నట్టు ఒక ప్రోమో విడుదల చేశారు. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ లేటెస్ట్ ప్రొగ్రామ్ లో సత్తి న్యూస్ యాంకర్ అవతారంలో కనిపించాడు. సత్తి జనాల మధ్య తిరుగుతూ పంచ్ లు వేసి కామెడీ చేయాలి కానీ కొత్తగా యాంకర్ అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ అవతారం ప్రోమోకే పరిమితమా లేక ఒరిజినల్ కార్యక్రమంలో కూడా ఆయన యాంకర్ గా కనిపిస్తాడా అనేది వేచి చూడాల్సిందే.