ఇలియానాకు చెప్పుకోలేని కష్టాలు.. యాంకర్ గా గోవా బ్యూటీ..

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఇలియానాకు ఇప్పుడు కష్ట కాలం నడుస్తుంది ఎంత చూపించినా ఎంత చేసినా కూడా ఈమెకు కాలం కలిసి రావడం లేదు దానికి తోడు తెలుగులో 2012లో జులాయి తర్వాత 2018 లో ఆరేళ్ల గ్యాప్ తీసుకుని ఈమె నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా డిజాస్టర్ అయిపోయింది ఈ సినిమా తర్వాత దర్శక నిర్మాతలు ఆమె వైపు చూడటం మానేశారు దానికి తోడు భరించలేనంతగా బరువు పెరిగిపోయింది. ఒకప్పుడు నడుము మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు ఫ్యాట్ అండ్ సెక్సీగా ఒళ్లంతా సెగలు పుట్టిస్తుంది. ఆరేళ్ళ తర్వాత మళ్లీ సౌత్ కు వచ్చినా ఆమెను పట్టించుకోలేదు మన నిర్మాతలు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కోసం ఇలియానాకు ఏకంగా 2 కోట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు మరో అవకాశం ఇవ్వడం కూడా గగనం అయిపోతుంది. ఇన్నాళ్లూ టాలీవుడ్ ను పెద్దగా పట్టించుకోని ఇలియానా.. ఇప్పుడు ఫోటోషూట్లతో తన ఆగమనాన్ని చాటుతుంది.
వస్తున్నా చూసుకోండి అన్నట్లు కొత్త ఫోటోలతో సందడి చేస్తుంది. బాలీవుడ్ లో ఎంత రెచ్చిపోయినా ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. రెండేళ్ల కింద బాద్ షాహోలో ఏకంగా న్యూడ్ గా నటించింది ఇలియానా. ఓ సన్నివేశం కోసం అజయ్ దేవ్ గన్ ముందు న్యూడ్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. పైగా సినిమాలో ముద్దులు.. హాట్ సీన్లతో రెచ్చిపోయింది ఈ జఘన సుందరి. ఇంత చేసినా కూడా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. తెలుగులోనూ ఇదే పరిస్థితి. అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ తర్వాత ఇలియానా వైపు చూడ్డానికి కూడా ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. పైగా ఇప్పుడు ఏ హీరో కూడా ఇలియానాతో నటించడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నా కూడా దీనిని ఎవరు కన్ఫామ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇలియానా యాంకర్‌గా సత్తా చాటాలని ప్రయత్నాలు ప్రారంభించింది. యాంకర్ అంటే బుల్లితెర షోలలో యాంకర్ కాదు. స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు ట్రై చేస్తోంది. ఇప్పటికే ఓ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆ ఛానల్ యజమాన్యం కూడా తన ప్రపోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కానీ జరిగితే ఇలియానాకు అంతకంటే పరాభవం మరొకటి ఉండదు.