చైతూతో హారర్ థ్రిల్లర్ ప్లాన్ చేసిన విక్రమ్ కుమార్ !

మజిలీ సినిమాతో చానళ్ళ తరువాత సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా దెబ్బ గట్టిగా ఉన్నా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తమ షూట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆపక తప్పని పరిస్థితి. అయితే ఆ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్ అంటూ ఒక సినిమా మీద చర్చ జరుగుతోంది. అదేమిటి అంటే ఇప్పటికే మనోడు బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు, నాగార్జున లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో ఈయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.
ఇక ఇప్పుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అది కూడా ఒక మంచి జోనర్ అని అంటున్నారు. ఇక నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నాడని టాక్. అయితే ఈ సినిమాకి ‘థాంక్యూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ జానర్ గురించి గతంలో రకరకాల ప్రచారం జరిగినా ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. అదేంటంటే చైతూతో తెరకెక్కించే సినిమాని ఆయన గతంలో మాధవ్‌తో తీసిన ‘13 బీ’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించనున్నారని అంటున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘13 బీ’ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం అందుకుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో చైతూ ఈ సీక్వెల్లో నటించేందుకు సై అమ్మాదమో అంటున్నారు. చూడాలి ఇందులో నిజం ఎంత ఉంది అనేది.