మెగాస్టార్ సినిమాకి ఆసక్తికర టైటిల్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెం 150తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సైరా అనే కమర్షియల్ సబ్జెక్ట్ తో తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. ఇప్పుడు తన 152వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కమర్షియల్ సినిమాకి సామాజిక కోణాన్ని జోడించి సినిమాలు తీయగలిగే కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎప్పటినుండో ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో ఉద్యోగిగా కనిపిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.
దీన్ని చిరు 152 టీమ్ ఖండించకపోవడంతో (అసలు దేనినీ ఖండించలేదు) నిజం అయ్యిండచ్చు. చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే `మగధీర`, `బ్రూస్ లీ`, `ఖైదీ నంబర్ 150` చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ ఈ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారని టాక్. ఈ సినిమాలో చిరంజీవి గోవిందాచార్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఇందులో చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న చరణ్ ఆ సినిమాని త్వరగా ముగించుకుని ఈ 152 షూటింగ్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ నటించే పాత్ర పేరు సిద్దూ అని అంటున్నారు. అయితే వీటిలో నిజాలు ఏమేరకి ఉన్నాయో అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట మాట్నీ ఎంటెర్టైన్మెంట్ వాళ్లు. చూడాలి మరి ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారో ?