చరణ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడా .. అందుకే ఇలా ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. మొన్నటి దాకా సైరా నిర్మాణం, ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో చరణ్ తీరికలేకుండా గడిపాడు. అది అయిపోయాక ఇప్పుడు ఆచార్య పనిలో పడ్డాడు. అయితే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ప్రకటించగా ఇప్పుడు చరణ్ కూడా ప్రకటించే పనిలో ఉన్నాడు. దీనితో పలువురు దర్శకులు తన కోసం సిద్ధం చేసిన కథలని రాంచరణ్ వింటున్నాడట. ఇటీవల 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ రాంచరణ్ ని కలసి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. ఆ సినినా ఏమయిందో తెలీదు కానీ, తాజాగా మళ్ళీరావా, జేర్సీ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక తెలుగు అబ్బాయి, పంజాబీ అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ అని కూడా అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే చరణ్ ఏదీ ఫైనల్ చేయలేక తికమక పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?