ఆస్కార్ కు జల్లికట్టు

జల్లికట్టు ఇది తమిళనాడు సంప్రదాయ ఆట. ఇది ప్రతి సంవత్సరము సంక్రాంతి సమయంలో జరుగుతుంది.ఈ ఆటపై జంతు ప్రేమికులు ఎప్పుడు అసంతృప్తిని వ్యక్తంచేస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఈ ఆట కొనసాగుతేనే ఉంది. ఇక అసలు విషయానికొస్తే..లీజో జోస్ పెళ్ళిస్సేర్ దర్శకత్వంలో, ఓ. థామస్ పనికెర్ నిర్మాతగా వ్యవహరించిన "జల్లికట్టు" సినిమా 2019 లో విడుదల అయింది. ఆంటోనీ వర్గీస్,చెంబన్ వినోద్,వినోద్ జొస్ ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందింది. జల్లికట్టు సినిమా మలయాళంలో విమర్శకుల ప్రశంషలు పొందడమే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకుల ఆదరణకుడా పొంది మంచి విజయం సాధించింది.
ఈ కథలో తమిళనాడు జల్లికట్టు సంప్రదాయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా దర్శకుడు జంతువులకు,మనుషులకు మధ్య జరిగే కథను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు మలయాళం సినిమా పరిశ్రమ నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు సినిమా మరొక అద్బుతమైమ పురస్కారం వైపు అడుగులు వేస్తోంది. 2021 సంవత్సరం ఆస్కార్ పురస్కారాలకు గాను భారతదేశం తరపున 21 సినిమాలు అర్హతను పొందగా మలయాళం నుంచి జల్లికట్టు అర్హతను సాధించింది. ఈ సినిమాను తెలుగు లో ఆహా ott లో విడుదల చేసారు. తెలుగులో కూడా మంచి ప్రజాదరణ పొందింది.