English   

టైటానిక్ ని ముంచేసిన అవెంజర్స్ 

James Cameron
2019-05-09 19:21:05

అవెంజ‌ర్స్ సిరీస్ లో భాగంగా వ‌చ్చిన చివరి సినిమా అవెంజ‌ర్స్ : ఎండ్ గేమ్. ఏప్రిల్ 26న విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టి అందరూ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అక్కడి సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ ని కూడా షేక్ చేస్తుందంటే అవెంజర్స్ హ‌వా ఏ రేంజ్‌లో సాగుతుంతో అర్ధం చేసుకోవ‌చ్చు. రెండు వారాల వ్య‌వ‌ధిలోనే ఈ సినిమా 219 కోట్ల డాల‌ర్లు వ‌సూల్ చేసిందట. అలా చేసి గ‌తంలో టైటానిక్ సినిమా మొద‌టి రెండు వారాల లో కలెక్ట్ చేసిన 218 కోట్ల డాల‌ర్ల  మార్క్ ని దాటేసింది. టైటానిక్ సినిమా వ‌సూళ్ళ‌ని అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ చిత్రం కేవ‌లం 11 రోజుల‌లోనే దాటేయ‌డంతో టైటానిక్ సృష్టిక‌ర్త జేమ్స్ కామెరూన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాస్త విభిన్నంగా స్పందించారు. మార్వెల్ సంస్థ అధినేత కెవిన్ ఫిజ్, ఇతర సిబ్బందిని ఉద్దేశించి..‘నిజమైన టైటానిక్‌ ఓడను ఓ ఐస్‌బర్గ్ ముంచేసింది. కానీ నా ‘టైటానిక్‌’ను మీ ‘అవెంజర్స్‌’ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్‌స్టోర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని సిబ్బంది మీ విజయానికి సెల్యూట్‌ చేస్తున్నారు. సినీ పరిశ్రమ సజీవంగానే కాదు సరికొత్త ఎత్తుకు చేరుకుందని మీరు నిరూపించారని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అవెంజర్స్ లోగోను ఢీకొట్టిన టైటానిక్ మునిగిపోతున్నట్లు డిజైన్ చేసిన ఓ ఫొటోను జేమ్స్ కామెరూన్ ట్వీట్ కు జతచేశారు.

More Related Stories