జాన్వీ కెరీర్ కి ఓటీటీ ఫీవర్..ఎవరేం చేయగలరు

అలనాటి అందాల తార శ్రీదేవీ కుమార్తె జాన్వీ కపూర్. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ భామ. ఆ సినిమా హిట్ అయిన తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న ఫైటర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుందని ప్రచారం జరిగింది. అయితే అదేదీ లేదని తేల్చేసారు. అయితే ఆమె కెరీర్ కి కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు చెబుతున్నారు. అది కూడా కరోనా వలన అట. ఎందుకంటే ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు చేస్తున్నా ఉపయోగం లేకుండా పోయిందని ఆ సినిమాలన్నీ... థియేట్స్లోకి రాకుండానే.. ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయని అంటున్నారు.
ధడక్ తర్వాత జాన్వి 'ఘోస్ట్ స్టోరీస్'లో నటించింది. దానిని నెట్‌ఫ్లిక్స్ కోసమే రూపొందిచడంతో... థియేటర్స్‌లో విడుదల కాలేదు. అయితే ఇప్పుడు రిలీజ్‌కు రెడీగా ఉన్న గుంజాన్ సక్సేనా రూహి ఆఫ్జా సినిమాలు కూడా కరోనా భయంతో ఓటీటీని ఆశ్రయించడంతో.. తండ్రి బోనీ కపూర్ కూతురు స్టార్‌డమ్‌పై బెంగ పెట్టుకున్నాడనే ప్రచారం బీ టౌన్ లో జోరుగా సాగుతోంది. కెరీర్ ఆరంభంలోనే.. లేడీ ఓరియెంటెడ్ మూవీ ""గుంజాన్ సక్సేనా''లో నటించే అవకాశం జాన్వీకి వచ్చింది. కార్గిల్ యుద్ధం సమయంలో గాయపడిన సైనికులను సురక్షిత ప్రదేశానికి తీసుకొచ్చిన పైలెట్ గుంజాన్ సక్సేనా బయోపిక్ ఈ సినిమా. ఇక రూహి ఆఫ్జా పేరుతో రూపొందే చిత్రంలో జాన్వి డ్యూయెల్ రోల్ పోషించనుంది. థియేటర్స్ మూతపడడంతో.. ఈరెండు సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట మేకర్స్. అయితే సినిమా ఎంత బాగున్నా.. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా.. థియేటర్లో వచ్చినంత రెస్పాన్స్ ఓటీటీలో రాదన్న బాధ బోనీ ఫ్యామిలీని వెంటాడుతోందని అంటున్నారు. అయితే రిలీజ్ ఎక్కడ చేయాలన్నది నిర్మాతల ఇష్టం కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు.