కబీర్ సింగ్ 10 రోజుల కలెక్షన్స్

తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా రిలీజయిన కబీర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజయి పది రోజులు అయ్యింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా జూన్ 21 ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్తోంది. పది రోజుల్లో కబీర్ సింగ్ చిత్రం రూ.181.57 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. మొత్తానికి తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా విషయంలో ఏమేం వివాదాలు నడిచాయో బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ అంతకన్నా ఎక్కువే ఇబ్బందులు పడుతోంది. క్రిటిక్స్ ఈ సినిమాను ఒక చెత్త సినిమాగా చిత్రీకరించినా కేవలం మౌత్ టాక్ వలన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. ఇక ఈ సినిమా షాహిద్ కపూర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చూడాలి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ?