ఎండల్లో నువ్వు తిరగొద్దే.. సూర్యుడికే చమటట్టుద్దే..
_600x600.jpg)
భీష్మ సినిమాలో ఈ లైన్ రష్మిక మందన్న కోసం రైటర్ కాసర్ల శ్యామ్ రాసాడేమో కానీ ఇప్పుడు ఆయన కాజల్ ను ఇలా చూసుంటే మాత్రం అక్కడ హీరోయిన్ ను మార్చేస్తాడు. కచ్చితంగా ఈ లైన్స్ మీ కోసమే అంటూ ప్లేట్ మార్చేస్తాడు. అంతగా ఎండల్లో సోకులు ఆరబోసింది కాజల్ అగర్వాల్. ఆమెను చూస్తుంటే నిజంగానే సూర్యుడికి చెమటలు పట్టేలా కనిపిస్తున్నాయి. నిండా కప్పుకునే మంట పుట్టిస్తుంది కాజల్. ఇప్పటికీ ఈమె వరస సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా చిరంజీవి, కొరటాల శివ ఆచార్య సినిమాలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా కోసం 2 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది కాజల్.
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు చాలా రోజుల తర్వాత ఫోటోషూట్స్ పై కాన్సట్రేషన్ పెట్టింది. ప్రస్తుతం తమిళనాట కమల్ హీరోగా భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది కాజల్. దాంతో పాటే చిరంజీవి సినిమాకు కూడా సైన్ చేసింది. ఎందుకో తెలియదు కానీ మధ్యలో ఓ సారి హాట్ అందాలు చూపించాలనే కోరిక కలిగినట్లుంది. అందుకే వెంటనే హాట్ గా మారిపోయింది చందమామ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
నడుము చూపిస్తూ షో కొంటెగా చేస్తుంది. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అయిపోతున్నారు. ఆ మధ్య బాలీవుడ్ మోజులో పడి కాస్త డోస్ పెంచేసిన చందమామ.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే కంటిన్యూ చేస్తుంది. ఈ మధ్య కొన్ని సినిమాల్లో అందాలను కూడా బాగానే ఆరబోసింది కాజల్ అగర్వాల్. తన కంటే వయసులో చిన్నవారైన హీరోలతో కూడా నటిస్తుంది కాజల్. శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళే. మొత్తానికి ఈమె అందాల ఆరబోత చూస్తుంటే మరో రెండు మూడేళ్ల పాటు ఇండస్ట్రీలోనే హీరోయిన్ గా ఉండాలని ఫిక్సైపోయింది.