కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ చేస్తుందంట తెలుసా..

సినిమాలతో పాటు అభివృద్ది చెందుతున్న వరల్డ్ డిజిటల్. అందుకే ఇండస్ట్రీలో ఉన్న వాళ్లందరి చూపు కూడా ఇప్పుడు డిజిటల్ వైపు మళ్లుతుంది. ఫ్యూచర్ అంతా డిజిటల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా అంతా సినిమాల నుంచి డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ చాలా మంది అక్కడ తమ సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఇదే నడుస్తుంది. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తుంది. ప్రస్తుతం వరస సినిమాలతో దుమ్ము దులిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేయడానికి చూస్తుంది. అక్కడ భారీ రెమ్యునరేషన్స్ ఇస్తుండటంతో అక్కడ కూడా తన అడుగు వేయడానికి ప్రయత్నిస్తుంది కాజల్. పైగా అక్కడ సినిమాలకు కష్టపడినంత కూడా అవసరం లేదు.. డేట్స్ కూడా తక్కువగానే అడుగుతుంటారు. ఎలా చూసుకున్నా కూడా సినిమా కంటే తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు వస్తుంటే ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు.. ఇప్పుడు చందమామ కూడా ఇదే చేయడానికి సిద్ధమవుతుంది. తమిళ అగ్ర దర్శకుడు వెంకట్ ప్రభు ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అనే వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఎలాగూ దర్శకుడిగా ఈయనకు కావాల్సినంత ఇమేజ్ ఉంది. 10 ఎపిసోడ్లుగా రాబోయే ఈ సీరిస్ కోసం భారీ పారితోషికం అందుకోబోతుంది కాజల్. ఇప్పటికే ఈ షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలోనే విడుదల కానుంది కూడా. ఈమెతో పాటు సమంత అక్కినేని, మెహ్రీన్ కౌర్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.