పవన్ సినిమాకి...కీరవాణి మ్యూజిక్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కాకుండా పవన్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంద నుందని ఆ సినిమా పీరియడ్ ఫిలిం అని ప్రచారం జరుగుతోంది. జానపద జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ దొంగగా నటించనున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారట. త్వరలోనే దీనికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే పవన్, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇదే అవుతుంది. అయితే క్రిష్ దర్శకత్వం వహించిన ‘వేదం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ సినిమాలకు కీరవాణి స్వరాలు అందించారు. ఆ పరిచయం కాక ఇది జానపద చిత్రం కావడంతో ఈ సినిమాకి ఆయనను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా రేపటి నుండి షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలొస్తున్నాయి.